సమర్ధవంతమైన సేవలందేలా కృషి

  • కరీంనగర్ సీపీ గౌస్ ఆలమ్
  • మొదలైన జోనల్ స్థాయి డ్యూటీ మీట్
  • పాల్గొననున్న 91 మంది పోలీస్ సిబ్బంది

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ: ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందని వీలవుతుందని కరీంనగర్ పోలీస్ కవి షనర్ గౌస్ ఆలమ్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3వ జోనల్ లెవల్ పోలీస్ డ్యూటీ మీట్- 2026లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోటీలను ప్రారంభించారు.

మంగళవారం అస్త్ర కన్వెన్షన్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ జోన్- 3 పరిధిలోని 5 జిల్లాల నుంచి మొత్తం 91 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ డ్యూటీ మీట్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో కరీంనగర్ నుండి 24 మంది, సిద్ధిపేట 19 మంది, రాజన్న సిరిసిల్ల 21 మంది, కామారెడ్డి 13 మంది, మెదక్ 14 మంది పాల్గొనున్నట్లు వివరించారు.

శాస్త్రీయ దర్యాప్తు, యాంటీ సబోటేజ్ చెక్, డాగ్ స్క్వాడ్, కంప్యూటర్ అవగాహన, ఫోటోగ్రఫీ, వీడియోగ్ర ఫీ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని మల్టీ జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన మేరకు బంగారు పతక విజేతలకు రూ.3 లక్షలు, 3 అడ్వాన్స్ ఇన్ మెంట్లు, వెండి పతక విజేతలకు రూ.2 లక్షలు, 2 అడ్వాన్స్ ఇన్క్లిమెంట్లు, కాంస్య పతక విజేతలకు రూ.1 లక్ష, 1 అడ్వాన్స్ ఇన్ మెంట్ అందజేస్తారు. జట్టు విజేతలకు నగదు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని, ఈ డ్యూటీ మీట్ను పోటీగానే కాకుండా వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశంగా తీసుకోవాలని సీపీ సూచించారు.

క్రమశిక్షణ, అంకితభావంతో పాల్గొని సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయాన్ని పెంపొందించుకొ వాలన్నారు. దీని ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్ జి, వేణుగోపాల్, వెంకటస్వామి, ఇతర జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.