ఘనంగా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ వేడుకలు
- జెండా ఆవిష్కరించిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్…
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ జెండా ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేణుకుంట్ల మహేష్ మాదిగ మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ 32 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నో చారిత్రక విజయాలు సాధించి, అనేక కుల సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల త్యాగ ఫలితంగా సాధించిన ఎస్సీ వర్గీకరణ ప్రయోజనాలను మాదిగ సమాజంలోని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంఆర్పీఎస్-టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల సతీష్ మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శీలపాక హరీష్ మాదిగ, మండల నాయకులు పసుల కుమార్, శీలపాక నరేష్, మంత్రి రాజు, కన్నూరి నరేష్, రేణుకుంట్ల శ్రవణ్ కుమార్, ఒంటెరు ప్రేమ్ కుమార్, ఇస్సాక్, రత్నం కాంతయ్య, అంతడుపుల రమేష్, బచ్చల శ్రీనివాస్ మాదిగ, బండారి మధు తదితరులు పాల్గొన్నారు.
