ఎస్‌ఐఆర్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి..

  • సర్పంచ్ కొడప ప్రకాశ్

జైనూర్, ఆంధ్రప్రభ: ఎస్‌ఐఆర్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాశ్ అన్నారు.

మంగళవారం జైనూర్‌లోని బాలాజీ నగర్‌లో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ సర్వేను ఆయన పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించి తమ ఫారాలను నింపి బీఎల్‌ఓకు అందించాలని, ఒక్కరూ సర్వేకు దూరం కాకూడదని కోరారు.

అనంతరం గ్రామపంచాయతీలో ఇప్పటివరకు నిర్వహించిన ఎస్‌ఐఆర్ సర్వే పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ కమల, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.