దండేపల్లిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జెండా ఆవిష్కరణ, అంబేద్కర్ విగ్రహానికి నివాళులు..
ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం కొనసాగించాలని పిలుపు
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించారు.
ముందుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలని, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ చేసిన సుదీర్ఘ పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. నిరంతర ఉద్యమం ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగారపు మురళీకృష్ణ మాదిగ, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బచ్చల అంజన్న మాదిగ, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు లింగంపెల్లి బాపు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు తగరపు సత్యం మాదిగ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జిల్లపెల్లి రమేష్, మాజీ ఎంపీటీసీ మల్యాల శ్రీనివాస్ మాదిగ, అఖిల భారత అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు కొల్లూరి రవికుమార్, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఆవుల శ్రీనివాస్ మాదిగ, ఉపరపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
