Prasanna Atluri | అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి..

Prasanna Atluri | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని ప్రసన్న అట్లూరి మృతి చెందారు.

ప్రాథమిక వివరాల ప్రకారం.. ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్‌ను ఉల్లంఘించడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రసన్న అట్లూరి తీవ్రంగా గాయపడగా, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

ప్రసన్న ఇటీవల అమెరికాలోని పేస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. త్వరలోనే ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు, ప్రవాస భారతీయులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. ఈ విషాద ఘటనతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.