కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి..

  • కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కత్తెరశాల శ్రీనివాస్
  • కాంగ్రెస్ పార్టీ విస్త్రుత సమావేశం

కేసముద్రం, ఆంధ్రప్రభ: రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరశాల శ్రీనివాస్ అన్నారు. సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కత్తెరశాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తిస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కీర్తి సురేందర్, జిల్లా కార్యదర్శి చిట్ల సంపత్, చిల్లంచెర్ల సతీష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్, మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్, కేసముద్రం విలేజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సుభాష్ రెడ్డి, ఎస్టీ సెల్ గ్రామ అధ్యక్షుడు లావుడియా వెంకన్న, నాయకులు పెండల లక్ష్మణ్, గుబ్బ వెంకన్న, ఉల్లి వెంకటేశ్వర్లు, కీర్తి సంపత్, కీర్తి సారయ్య, ఎండి అమీర్, గుండు లక్ష్మీనారాయణ, బోళ్ల అశోక్, కట్కూరి జనార్ధన్, వల్లందాస్ వెంకన్న, దేవదానం తదితరులు పాల్గొన్నారు.