వైభవోపేతంగా ఉత్సవమూర్తుల ప్రతిష్ఠాపన
బాసర ఆలయ పునర్నిర్మాణంలో మరో ఘట్టం..
వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు
పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే..
బాసర, (ఆంధ్రప్రభ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కళాపకర్షణ పూజలు వైభవంగా జరిగాయి. శృంగేరి పీఠాధిపతులు అందజేసిన దారు ఉత్సవమూర్తులకు శృంగేరి నుంచి వచ్చిన పండితులు, ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ అభిషేకాలు, సంకల్పం, గణపతి పూజ, కళాపకర్షణ పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా బలాలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠాపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత, స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
