సహకార స్ఫూర్తిని చాటిన విద్యార్థులు

‘సహకారమే సమృద్ధి’ అంశంపై ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో వ్యాసరచన పోటీలు

నిజామాబాద్, (ఆంధ్రప్రభ): భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు అయి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా స్థానిక ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో మన బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. “భారతదేశంలో సహకార ఉద్యమం – సహకారమే సమృద్ధి” అనే అంశంపై విద్యార్థులు తమ ఆలోచనలు, విజ్ఞానాన్ని వ్యాసాల రూపంలో ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బ్యాంకు సహాయ జనరల్ మేనేజర్ వి. శ్రీధర్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సహకార భావనను యువతలో పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ కిషోర్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు. పోటీల్లో విజేతలకు సోమవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగే వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.