ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిథి అధ్యాపకుల నియామకం

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మ జ్యోతిభాపూలె తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయులు, అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి జూలై 8న డెమో నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్సీఓ సేరు శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

లక్షెట్టిపేటలోని ఏంజేపీ పాఠశాలలో ఉదయం 9 గంటలకు డెమో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈడీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు.

విద్యార్హతలు, డెమో ప్రదర్శన, మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు రెస్యూమ్, విద్యార్హత పత్రాలు, బోధన అనుభవ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.