పార్లమెంట్ వర్షాకాల సెషన్ షెడ్యూల్ ఖరారు..

ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిపారు. ఈ మేర‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సమావేశాల్లో దేశానికి సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు, విధాన నిర్ణయాలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజాప్రాధాన్యత గల సమస్యలపై పార్లమెంటులో సారవంతమైన చర్చలు జరగాలని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల్లో పలు బిల్లులు, విధాన నిర్ణయాలు, ఆర్థిక, సామాజిక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.