Revanth reddy | మహిళా సాధికారతలో తెలంగాణ ముందంజ

Revanth reddy | మహిళా సాధికారతలో తెలంగాణ ముందంజ

Revanth reddy | మహిళా సాధికారతపై ప్రభుత్వ దృష్టి
సంక్షేమ పథకాలతో ఆడబిడ్డలకు అండ
మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు
ఇందిరా మహిళా శక్తి – ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తల దిశగా
ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ – గృహిణులకు ఊరట
భవిష్యత్తు కోసం మహిళా అభివృద్ధి చర్యలు

Revanth reddy | లక్ష్మీ దేవిని మనం ఐశ్వర్యంకి ప్రతీకగా మన సమాజమంతా భావిస్తాం. ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో… అక్కడ దేవుళ్లు కొలువై ఉంటారన్నది మన సమాజంలో బలంగా నాటుకుపోయిన ఒక విశ్వాసం. అంటే దాని అర్థం… అవనిలో సగం… ఆకాశంలో సగమైన ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్నదే. ఒకనాడు మహిళలు అంటే వంటింటి కుందేళ్లు అనే వాళ్లు. కానీ, నేడు ఈ ప్రపంచపు ప్రగతికి రథ చక్రాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న సందేశం. మహిళా ప్రస్తావన సందర్భంగా… తెలంగాణలో సీఎం రేవంతన్న నేతృత్వంలో ఆడబిడ్డలకు అందుతున్న పథకాలు, సహకారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మన తెలంగాణ మట్టి వీరనారి చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి మహామహులు నడిచిన ప్రాంతం. విప్లవ పోరాటాలు… బతుకు ఆరాటాలు కేవలం పురుషులకు మాత్రమే సొంతం కాదు, మహిళలు కూడా సమర్థవంతంగా చేయగలరని నిరూపించిన నేల మనది. అందుకే ప్రతి ఇంట్లో లక్ష్మీ దేవి ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంతన్న నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలును ప్రవేశపెట్టింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న తలంపుతో వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను అమలు పరుస్తోంది రేవంత్ సర్కారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై దృష్టి సారించి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.

ఇల్లాలి చదువు… ఇంటికి వెలుగు… ఇది నిన్నటి మాట. మహిళా ఉన్నతి… తెలంగాణ ప్రగతి… అన్నది రేవంతన్న నేటి మాట. గతంలో మహిళా సంఘాలు అంటే స్వయం ఉపాధి. కాని ప్రజా ప్రభుత్వంలో మహిళా సంఘాలు అంటే పది మందికి ఉపాధి. ఆ దిశలోనే ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. ఇందిరమ్మ క్యాంటీన్లు, సొలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సంపద సృష్టిలో అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భాగస్వామ్యం జీడీపీలో 40 శాతానికి మించి ఉంటుంది. కానీ మన దేశంలో వారి వాటా 18 శాతంలోపే ఉంది. అందుకే సంపద సృష్టిలో మహిళలకు అవకాశాలు పెంచేందుకు, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది.

మహిళలు సాధించిన ప్రగతిే, ఆ సమాజ ప్రగతికి కొలమానమని రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విశ్వసించారు. ఆయన ఆలోచనలను ఆచరిస్తోంది ప్రజా ప్రభుత్వం. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు. అందుకే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశలో ఎన్నో పథకాలను రేవంత్ ప్రభుత్వం అమలు పరుస్తోంది.

మహిళలను మహాలక్షిగా గౌరవించడం మన సంస్కృతి. అందుకే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తోంది. దీంతో ఆదా అయ్యే మొత్తాన్ని ఇతర అవసరాలకు ఖర్చు చేసుకునే వెసులుబాటు మహిళలకు కలిగింది. ఇప్పటివరకు సుమారు 200 కోట్ల మంది మహిళలు ఈ పథకం ఉపయోగించుకున్నారు. నిరుపేద, మధ్య తరగతి గృహిణుల వంటింటి భారంను తగ్గించేందుకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్‌ను అందిస్తోంది ప్రజా ప్రభుత్వం. ఇప్పటి వరకు 50 లక్షల కుటుంబాలకు రాయితీ సిలిండర్లు అందుతున్నాయి.

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలు అంటే కుట్లు, అల్లికలే కాదు… మహిళలు అంటే సంపద సృష్టికర్తలు. అందుకే మహిళా శక్తి కార్యక్రమం కింద 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చారు. దీంతో ఎంతోమంది మహిళల జీవితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఐదేళ్లలో లక్ష కోట్లతో లక్షలాది మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశ చరిత్రలో ప్రప్రథమంగా మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తూ… వెయ్యి మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఒక్కో మెగావాట్ ప్లాంట్‌కు మూడు కోట్ల వ్యయంతో అడుగులు వేసింది. మొదటి విడతలో 64 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కోసం రూ.200 కోట్లు విడుదల చేయడం జరిగింది.

మహిళలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు ఇచ్చింది. ఇప్పటికే నారాయణపేటలో ఒక పెట్రోల్ బంకును మహిళలకు అప్పగించింది ప్రభుత్వం. రానున్న రోజుల్లో మరిన్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. 17 రకాల వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ రూ.22 వేల కోట్ల రుణాలు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు… వడ్డీలను ప్రభుత్వం భరిస్తోంది.

మహిళా దినోత్సవం రోజుకి వేయి కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. మహిళా సంఘ సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది. ఐటీ కారిడార్‌లో మూడెకరాల స్థలంలో రూ.9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసింది. వందకు పైగా స్టాళ్ల ఏర్పాటుతో మహిళా సంఘాల ఉత్పత్తులకు గిరాకి, మహిళా సంఘాలకు లక్షల ఆదాయం ఏర్పడింది.

స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫాం కుట్టు పనులు ఇవ్వడంతో పాటు, చార్జీలను జతకు రూ.50 నుంచి రూ.75కు పెంచింది ప్రభుత్వం. స్కూల్ పిల్లలకు పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు అందించడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత. గతంలో నాలుగు నెలల తర్వాత అందేవి. ఈ పనుల ద్వారా మహిళా సంఘాలకు రూ.80 కోట్ల లబ్ధి చేకూరింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 115 కోట్ల ప్రయాణాలకు గాను రూ.4,500 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. వందలాది మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి వారిని స్వశక్తి వనరులుగా మార్చింది. సబ్సిడీలో ఈ-ఆటోలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో ఆటో ఖర్చు మూడున్నర లక్షలు కాగా, లక్ష రూపాయలు ప్రభుత్వం భరించే అవకాశం ఉంది.

జిల్లాకు ఒకటి చొప్పున 32 జిల్లాల్లో మహిళలకు సబ్సిడీలో మొబైల్ ఫిష్ ట్రక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో ట్రక్‌పై రూ.6 లక్షల సబ్సిడీ అందజేయనుంది. సచివాలయం నుంచి కలెక్టరేట్లు, పర్యాటక కేంద్రాల వరకు వంద మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేపట్టింది. క్యాంటీన్ల నిర్వహణకు గచ్చిబౌలిలోని ప్రముఖ సంస్థల్లో ఉచిత శిక్షణ అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

అంగన్వాడీల్లో 14 వేల టీచర్లు, హెల్పర్ల నియామక నోటిఫికేషన్ విడుదల చేసి నిజమైన మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోంది. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలను చేర్చేందుకు కసరత్తులు చేస్తున్నది. అత్యున్నత మహిళా సాధికారత విధాన రూపకల్పన కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సంకల్పంతో అమలు చేస్తోంది.

  • సత్తు మల్లేష్‌,
    గ్రంథాలయ కమిటీ చైర్మన్‌.
    కరీంనగర్‌.

Leave a Reply