డూండి రాకేష్ నివాసానికి టీ.జి. వెంకటేష్..
రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ
రాకేష్ కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఉందన్న టీ.జి. వెంకటేష్
భవానిపురం, ఆంధ్రప్రభ : మాజీ రాజ్యసభ సభ్యుడు, ఆర్యవైశ్య ప్రముఖుడు టీ.జి. వెంకటేష్ శుక్రవారం విజయవాడలో డూండి రాకేష్ నివాసానికి మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించడంతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులతో సమావేశమయ్యారు.డూండి రాకేష్ నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యుడు టీ.జి. వెంకటేష్ పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన వివిధ కార్యక్రమాలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై రాకేష్‌తో ఆయన చర్చించారు. అనంతరం అల్పాహార కార్యక్రమంలో పాల్గొని ఆర్యవైశ్య ప్రముఖులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా టీ.జి. వెంకటేష్ మాట్లాడుతూ, డూండి రాకేష్‌తో తనకు ఎన్నో ఏళ్లుగా సామాజిక అనుబంధం ఉందని, రాకేష్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల ద్వారా ఆయన కుటుంబ సభ్యులతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఆ అనుబంధంతోనే మర్యాదపూర్వకంగా వారి నివాసానికి వచ్చినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర కుమార్, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త ముక్తేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వక్కలగడ్డ పవన్ కుమార్, మార్కెట్ యార్డ్ ఏఎంసీ డైరెక్టర్ సి.ఎల్. అరుణ్, ఐటీడీపీ అధికార ప్రతినిధి కేఎల్‌వీ సతీష్, దేవకి వెంకటేశ్వర్లు, పెనుగొండ సుబ్బారాయుడు తదితరులతో పాటు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.
