Notification | ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారీ అవకాశం
జూలై 20 వరకు దరఖాస్తులకు అవకాశం..
నెలకు రూ.75 వేల కన్సాలిడేటెడ్ వేతనం
Notification | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు (APTRANSCO, APGENCO, APSPDCL, APCPDCL, APEPDCL) సంయుక్తంగా 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఉద్యోగం కోరుకునే ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఇది మంచి అవకాశంగా నిలుస్తోంది.
నోటిఫికేషన్ ప్రకారం ఎలక్ట్రికల్, సివిల్, టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో B.E./B.Tech లేదా A.M.I.E అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులను కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1,000గా నిర్ణయించారు.
ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషనరీ కాలంలో నెలకు రూ.75,000 కన్సాలిడేటెడ్ వేతనం చెల్లిస్తారు. అనంతరం సంస్థ నిబంధనల ప్రకారం రెగ్యులర్ పే స్కేల్ అమలులోకి వస్తుంది.
పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అందులోని సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
