SIR ఫారం ను పూర్తి చేసిన మాజీ మంత్రి పువ్వాడ

  • ప్రతి కుటుంబం SIR ఫారం ప్రక్రియ పూర్తి చేయాలి
  • డివిజన్ లలో brs నాయకులు సహాయం అందిస్తారు.

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఈరోజు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ తమ కుటుంబ సభ్యుల SIR ఎన్యూమరేషన్ ఫారాలను సంబంధిత BLO శ్రీమతి షాహీన్ కమల్ గారికి సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు , అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్రతి కుటుంబం తమ SIR ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపి సంబంధిత BLOలకు సమర్పించాలని కోరారు. ఫారాలు నింపడంలో లేదా వివరాల విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే, BRS పార్టీ తరఫున ప్రతి డివిజన్‌లో అందుబాటులో ఉన్న BLS సభ్యులు పూర్తి సహాయం అందిస్తారని తెలిపారు.