వాహనదారుల కష్టాలకు చెక్..
- ఉట్నూర్–గుడిహత్నూర్ డబుల్ రోడ్డుకు రూ.144.44 కోట్ల నిధులు
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చొరవతో మంజూరు..
- ప్రజలు, కాంగ్రెస్ నేతల హర్షం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చోరువతో డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ, 144.44 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుండి గుడిహత్నూర్ వరకు నూతన డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ల ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయని నాయకులు పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉట్నూర్ నుండి గుడిహత్నూర్ వరకు రోడ్డు డబుల్ రోడ్డు నిర్మించడంతో వాన దారులకు ప్రయాణికులకు ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగుతుందని ఇంద్రవెల్లి ఉట్నూర్ మండలాల నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు నిరంతరం కృషి చేయడం పై అభివృద్ధికి ముందడుగులు వేస్తూ అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ప్రధాన సమస్యలను, ప్రధాన అభివృద్ధి పనులు చేపట్టడానికి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించడం ఎంతో సంతోషకరమని ప్రజలు నాయకులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నుండి ఓటు వరకు ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన సింగల్ బీటీ రోడ్డు వల్ల వాహనదారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు డబుల్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
