నూతన పాల సొసైటీ చైర్మన్‌లకు సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శ్రీకృష్ణ పాల సొసైటీ చైర్మన్‌గా పంతం కృష్ణ, కొల్లూరు పాల సొసైటీ చైర్మన్‌గా అయిలి కృష్ణ గౌడ్‌లు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ వారిని గురువారం ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ పాడి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల సొసైటీల పాత్ర కీలకమని, వాటి ద్వారా రైతులకు మరింత లాభదాయక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు కొలుపుల హరినాథ్, మాజీ కౌన్సిలర్ జింకల రామకృష్ణ యాదవ్, యువజన నాయకులు బోడ సతీష్, జింకల భరత్ యాదవ్, జూకంటి రాజ్ కుమార్ పాల్గొన్నారు.