డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన నూతన సీఎస్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా డిప్యూటీ సీఎంను భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు, ప్రభుత్వ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ఇరువురి మధ్య ప్రాథమికంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసేలా పరస్పర సహకారం కొనసాగించాలని ఈ భేటీ సందర్భంగా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
