ఎస్‌ఐఆర్‌పై అపోహలు వద్దు: తహసీల్దార్

బాసర, ఆంధ్రప్రభ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తహసీల్దార్ పవన్ చంద్ర సూచించారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీఎల్‌ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను అందజేయడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఫారాలు బీఎల్‌ఓల వద్ద అందుబాటులో ఉన్నాయని, ప్రతి అర్హత కలిగిన ఓటరు సర్వేలో భాగస్వామి కావాలని కోరారు.

రాజకీయ పార్టీలు కూడా ఓటర్లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ ప్రకాష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు, ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.