గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు..

మహాముత్తారం, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిమ్మగూడెం గ్రామంలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ముత్తారం ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో సివిల్ పోలీస్ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేపట్టారు. దాడుల్లో ఇద్దరు నిందితుల వద్ద నుంచి సుమారు 50 లీటర్ల గుడుంబాతో పాటు తయారీకి వినియోగించే బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.