AP | బీఏసీలో ఖరారైన షెడ్యూల్..
బీసీ రిజర్వేషన్ నివేదికపై రేపు చర్చ
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. సోమవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
మంగళవారం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన 9 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో సభ ముందుకు తీసుకురావాలని బీఏసీ తీర్మానించింది.
ఆగస్టు 19న గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 అంశంపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని నిర్ణయించారు. సమయ పరిమితి లేకుండా అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, చీఫ్ విప్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
