రోడ్ల అభివృద్ధికి భారీ నిధులు.. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కృషి ఫలితమే
- బొడ్డు గంగన్న
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల నాయకులు మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కృషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.
ఖానాపూర్ నుంచి బెల్లాల్ వరకు రహదారి అభివృద్ధి కోసం రూ.67.57 కోట్లు, హల్లంపల్లి–గంగాపూర్ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం రూ.14.67 కోట్లు మంజూరు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్ల అభివృద్ధికి నిధులు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ మండల ప్రజల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు మల్లేశ్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్, రాహుల్ గాంధీ ఫాలోవర్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు కమలాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముస్కు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
