పంటలపై ముప్పు.. రైతు ఎదురుచూపులు

  • 15 రోజులు ఆయే…
  • ఏంటి పరిస్థితి అంటున్న రైతులు
  • ఆందోళనలో రైతాంగం
  • వేసిన విత్తనాలు దక్కేనా?

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : వాన వస్తలేదు… కానీ గాలి వస్తుంది.. సాయంత్రం వేళలో చల్లగాలులు ఉదయం నెలలో మోస్తారు ఎండలు ఏంటి పరిస్థితి అని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. కాలం పోతుందని ఏం చేయాలో తోచడం లేదని రైతులు వాపోతున్నారు. గత 15 రోజుల నుండి అదనయ్యే వర్షాలు పడటం లేదు. నాలుగైదు సార్లు అదును కావాల్సిన వర్షాలు పడాల్సి ఉండగా ఇప్పటికీ ఒక్కసారి వర్షం కురిసింది.

రోహిణి మృగశిర కార్తులు వెళ్లిపోగా ఆరుద్ర కార్తి కూడా వచ్చి దాదాపు పది రోజులు అవుతుంది. మొత్తంగా వర్షపాతం చూస్తే అధికంగానే నమోదయింది. కానీ విత్తనాలు వేస్తే పెరిగే విధంగా అదునయ్యే వర్షాలు నాలుగైదు సార్లు పడే అవకాశాలు ఉంటే విత్తనం బాగా మలికెత్తి సాగయ్యే అవకాశం అధిక దిగుబడి వస్తుంది. జిల్లాలో ఇప్పటికీ 60 శాతం పత్తి సాగైనట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎకరాల సాగు చేస్తారని వ్యవసాయ అధికారుల అంచనా.. ఇప్పటి వరకు లక్ష 57 వేల ఎకరాలు పత్తి సాగు చేశారని ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ చెప్పారు. దాదాపుగా 15 రోజులుగా వర్షాలు పడలేదని అక్కడక్కడ పడిన ఆశించిన స్థాయిలో విత్తనాలు వేసే స్థాయిలో పడలేదని తెలిపారు.

మొలకెత్తిన విత్తనాలు కొద్దిపాటి ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ల ఎత్తు పెరగగా వాటి సాగు సాళ్లలో గుంటుకాగొట్టి కలుపు తీసి మొలిచిన గడ్డిని రైతులు తీసి వేస్తున్నారు. దుక్కి దీన్ని శుభ్రం చేస్తున్నారు. వర్షాలు రాకపోతే బోర్ల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ద్వారా నీటిని పత్తి మొక్కలకు పైప్ లైన్ల ద్వారా నీటిని వేస్తున్నారు. వర్షం వస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఎండబెట్ల గ్రామానికి చెందిన రవి అనే రైతు తెలిపారు ఎక్కువగా రైతాంగం వర్షాధారంపైనేని ఆధారపడి పత్తిని సాగు చేస్తారు కొంతమంది రైతులు దాదాపు ఒక యాభై శాతం బోర్ల ద్వారా నీటిని చేస్తారు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు గాలి వస్తుంది కానీ వాన వస్తలేదని ఆందోళన చెందుతున్నారు.