శ్రీవారి సేవలో మంత్రి నారా లోకేష్
- తిరుప్పావడ సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు
- తీర్థప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు
తిరుమల, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన పవిత్రమైన తిరుప్పావడ సేవలో మంత్రి పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించారు.
మంత్రి నారా లోకేష్ తిరుమలకు చేరుకున్న సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి ఆలయ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నారా లోకేష్ మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర మంత్రి నారా లోకేష్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి సత్కరించారు.

