టెట్ దరఖాస్తుకు ‘వన్ టైం డిలీట్’ సదుపాయం
- నేటి నుంచి 5 వరకు ఉచితంగా వివరాలు మార్చుకునే వెసులుబాటు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET)-2026కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక అవకాశం కల్పించింది. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఒక్కసారి మాత్రమే (One-Time Correction) అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏపీ టెట్ కన్వీనర్ ఎం. వెంకట కృష్ణారెడ్డి విడుదల చేసిన ప్రకటనలో, అభ్యర్థులు జూలై 2 నుంచి జూలై 5 వరకు తమ దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సవరణలకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అభ్యర్థులు https://csc.ap.gov.in లేదా https://tet2dsc.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తులోని వివరాలను సవరించుకోవచ్చు. అయితే ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలను మార్చేందుకు అవకాశం ఉండదని, మిగిలిన అన్ని వివరాలను సరిచేసుకోవచ్చని తెలిపారు.
అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా తమ దరఖాస్తులను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.
