సోమదేవరపల్లి సర్పంచ్ కృష్ణమూర్తికి ఘన సన్మానం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి సర్పంచ్ కృష్ణమూర్తి ఎల్కతుర్తి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం అనిల్ శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. అలాగే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నెట్ కుమార్, వెంకన్న, కాసగోని రాజు, శ్రావణ్ కుమార్, మంద మొగిలి తదితరులు పాల్గొన్నారు.
