మద్యం మత్తులో పురుగుల మందు తాగి.. చికిత్స పొందుతూ మృతి
రేగొండ, ఆంధ్రప్రభ: రేగొండ మండలం మడ్తపల్లి గ్రామంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంబూల చిరంజీవి (30) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జూన్ 6వ తేదీ సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని పరకాలలోని సంతోష్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మంగళవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
