గీత కార్మికుని కుటుంబానికి కుట్టుమిషన్ అందజేత..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి గ్రామానికి చెందిన గీతా కార్మికుడు గుర్రపు గట్టయ్య , తాటి చెట్టు పై నుండి పడి నడుము భాగం పనిచేయకపోవడంతో తాటి చెట్టు ఎక్క లేని పరిస్థితి లో ఇంటి వద్ద కుటుంబ పోషణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో సమాచారం తెలుసుకున్న తెలంగాణ గౌడ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, జనగామ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రతినిధులు నాతీ గణేష్, బాల్నే రామచంద్రుడు, దృష్టికి తీసుకెళ్లగా బాధిత గీత కార్మికుడు గుర్రపు గట్టయ్య కుటుంబ పోషణ నిమిత్తం ఆయన భార్య గుర్రపు జ్యోతి కి రూ 15,000 వేల కుట్టుమిషన్ మంగళవారం అందజేశారు. గౌడ సంఘం వ తరఫున కె ఏ ఎన్ ఏ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర లక్మన్ గౌడ్, మాజీ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్ , గౌడ సంఘం నాయకులు గుర్రపు తిరుపతి, గౌడ్ ముత్యాల రాజబాబు గౌడ్, బుర్ర చక్రపాణి గౌడ్ బుర్ర రమేష్ గౌడ్ లు పాల్గొన్నారు.