పదవి విరమణ పొందిన టీచర్ కు ఘన సన్మానం..

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) ఉపాధ్యాయుడు రాపర్తి అశోక్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కడెం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 1994–95 టెన్త్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమకు విద్యాబోధన చేసిన గురువైన రాపర్తి అశోక్ కుమార్ దంపతులను శాలువాతో సత్కరించి, అశోక చెట్టు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కొత్త సత్యనారాయణ, హనుమండ్ల తిరుపతి, బిక్షపతి నాయక్, కిరణ్, జావిద్, మల్లేష్, గంగాధర్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.