మాజీ మార్కెట్ చైర్మన్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు చిప్పలపల్లి మహేంద్రనాధ్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ పట్టణంలోని నాగోల్ పవన్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ స్వయంగా ఆసుపత్రిలో పరామర్శించారు.ఈ సందర్భంగా ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన వెంట హాస్పిటల్ ఎం డి ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
