అగ్నిప్రమాద వశాత్తుమూడు దుకాణాలు దగ్ధం..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు మూడు షాపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో గుడికందుల సత్తయ్య, యండి కాజా మియాల చెందిన విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు పేర్కొన్నారు.మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న షాపుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదట ఒక షాపులో మొదలైన మంటలు, పక్కనే ఉన్న మరో రెండు దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. స్థానికులు గమనించి వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేశారు,స్థానిక ప్రజలు సుమారు గంటసేపు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
​అయితే, అప్పటికే మూడు దుకాణాల్లోని సామగ్రి, నగదు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు.