నూతన ఎంపీడీవోగా అజ్మీరా వసంత రామ్..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా అజ్మీరా వసంత రామ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన అజ్మీరా వసంత రామ్ పదోన్నతిపై టేకుమట్ల ఎంపీడీవోగా నియమితులయ్యారు.