క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం..

  • రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం
  • చైర్‌పర్సన్ సంధ్యారాణి అధ్యక్షతన సమావేశం..
  • ఎజెండా అంశాలకు సభ్యుల ఆమోదం

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన్ గొడిసెల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్ మేనేజర్ డి. స్వామి సభ్యులకు వివరించారు. ఎజెండాలోని రెండు అంశాలపై సభ్యులు చర్చించిన అనంతరం వాటిని కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఏ. మారుతి ప్రసాద్, వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత, రెవెన్యూ అధికారి కె. సతీష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాయి కిరణ్, సీనియర్ అకౌంటెంట్ ఇ. వీరన్న, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అధికారి సాయి నిఖిల్, కౌన్సిలర్లు కౌడగాని సాంబయ్య, కూతురు ప్రభాకర్, వేనంక శ్రీనివాస్, బీమా మల్లేష్, బొమ్మ భూమా గౌడ్, గ్యాస్ నాని, జంజిపల్లి శశి తదితరులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.