ఖానాపూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కృషి అభినందనీయం
- కాంగ్రెస్ సీనియర్ నేత ముసుకు రాజేందర్ రెడ్డి
కడెం, ఆంధ్రప్రభ : ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కడెం మండల సీనియర్ నాయకుడు ముస్కు రాజేందర్ రెడ్డి అన్నారు.
కడెం, ఖానాపూర్, ఉట్నూర్ మండలాల్లో కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవ, నిరంతర కృషి ఫలితంగానే ఈ మూడు మండలాలకు తహసీల్దార్ కార్యాలయ భవనాలు మంజూరయ్యాయని అన్నారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందుబాటులోకి వస్తాయని, పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు ముస్కు రాజేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
