బిఎడ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు : పిఓ

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ఉట్నూర్ గిరిజన సంక్షేమ శాఖ బీఈడీ కళాశాలలో 2026–28 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరంద తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని అర్హత కలిగిన గిరిజన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫారాలు జూలై 1 నుంచి 28 వరకు రూ.100 చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు.

పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 28న సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని సూచించారు. ప్రవేశాలపై మరింత సమాచారం కోసం అడ్మిషన్ల ఇంచార్జ్ సెల్ నంబర్లు 9440848073, 8500995561లను సంప్రదించాలని తెలిపారు.

బీఈడీ కోర్సులో ప్రవేశం పొందే గిరిజన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీవో మంద మకరంద కోరారు. అవసరమైతే నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసే అధికారం యాజమాన్యానికి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.