Sudha Kongara Salary Dispute | తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన కేసు

Sudha Kongara Salary Dispute | తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన కేసు

Sudha Kongara Salary Dispute | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర, తన తాజా చిత్రం ‘పరశక్తి’కి సంబంధించి చెల్లించాల్సిన పారితోషికంలో భారీ మొత్తం బకాయి ఉందని ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో ఇంకా రూ.8.39 కోట్లు అందలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు అదే నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న ‘ఇదయం మురళి’ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోర్టును ఆమె కోరినట్లు సమాచారం. పారితోషికానికి సంబంధించిన ఒప్పందాన్ని నిర్మాతలు పాటించలేదని ఆమె వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తూ, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

దర్శకురాలు సుధా కొంగర, నిర్మాణ సంస్థ మధ్య నెలకొన్న ఈ వివాదం ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కోర్టు తుది నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.