SpiceJet Tyre Burst | తప్పిన ప్రమాదం
SpiceJet Tyre Burst | తప్పిన ప్రమాదం
SpiceJet Tyre Burst | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బిహార్‌లోని దర్భంగా విమానాశ్రయంలో ఇవాళ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ముంబయి నుంచి వచ్చిన ఈ విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో ఒక్కసారిగా టైర్ పేలింది.
విమానంలో సుమారు 150మంది ప్రయాణికులు ఉండగా, పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇదే సమయంలో దర్భంగా విమానాశ్రయంలో ఆకాశా ఎయిర్‌కు చెందిన మరో విమానానికి కూడా సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ఘటనల కారణంగా కొంతసేపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టగా, విమానాశ్రయ కార్యకలాపాలను అనంతరం సాధారణ స్థితికి తీసుకొచ్చారు.
