Tirumala30june26 | భారీ రద్దీతో నేడు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేత
Tirumala30june26 | భారీ రద్దీతో నేడు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేత
తదుపరి ప్రకటన వచ్చే వరకు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి
Tirumala30june26 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో జూలై 1, 2026 (బుధవారం) నాడు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.
తిరుమలకు ఎస్ఎస్డీ టోకెన్ల ఆధారంగా దర్శనానికి రావాలని ప్రణాళిక వేసుకున్న భక్తులు, తదుపరి అధికారిక ప్రకటన వెలువడే వరకు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కొండపై భక్తుల రద్దీ అత్యధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
భక్తులు తిరుమలకు బయలుదేరే ముందు టీటీడీ అధికారిక ప్రకటనలు, దర్శనానికి సంబంధించిన తాజా సమాచారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు. అలాగే ఈ సమాచారాన్ని ఇతర భక్తులతోనూ పంచుకుని అనవసర ఇబ్బందులను నివారించాలని కోరారు.
ఓం నమో వేంకటేశాయ!
