వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు..

  • వ్యవసాయ చేనుల్లో విత్తనాలు విత్తిన రైతులు
  • వర్షాలు లేక విత్తిన విత్తనాలు పురుగుల పాలు
  • రోజు కారు మబ్బులు వర్షం చుక్కలు శూన్యం
  • పట్టణ గ్రామాలలో రైతుల మనోవేదన

పరకాల, ఆంధ్రప్రభ : వర్షాలు లేక రైతన్నలు ఎప్పుడెప్పుడు అన్ననట్లుగా వర్షాల కోసం రైతన్నలు ఎదిరి చూస్తున్నారు. రోజు కారు మేఘాలు కమ్ముకుని వస్తున్న వర్షం చుక్క కురువకపోవడంతో రైతన్నలు దిగులపడుతుండటం జరుగుతుంది. పట్టణ, గ్రామాలలో రైతన్నలు వర్షాలు కురుస్తాయని ఆశతో భూములలో విత్తిన విత్తనాలు పురుగుల పాలు కావడంలో రైతన్నలు మనోవేదనకు గురికాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికి నుండి ఇప్పటి వరకు ఒకటి రెండు తెలికపాటి వర్షాలు కురియడంతో రైతన్నలు వ్యవసాయ క్షేత్రాలలో వివిధ రకాల విత్తనాలు విత్తడం జరిగింది. విత్తిన విత్తనాలు వర్షాలు లేని కారణంగా పురుగుల పాలు కావడం జరుగుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖరీఫ్ సీజన్లో పడిన వర్షాలకు అనుగుణంగా విత్తనాలు నాటితే సరియైన క్రమంలో పంటల ఉత్పత్తులు వస్తాయని ఇప్పటి వరకు సుమారు 80 శాతం వరకు రైతులు విత్తనాలను విత్తినమని అంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాలు అనుకున్న విధంగా ఉంటాయని భావిచిన రైతన్నలకు భంగపాటు కలిగింది. దీంతో రైతన్న కండ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి. వరుణ దేవుని కాటాక్షం కోసం పట్టణ, గ్రామాలలో ఇప్పటికే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కప్పతల్లి ఆటలు ఆడుతున్న వరణ దేవుడు కరుణించడం లేదని రైతులు కుంగిపోతున్నారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిసే విధంగా చూడాలని రైతన్నలు రోజు మదిలో తలచుకోవడం జరుగుతుంది.