మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక బహిష్కరించిన ఏంఐఎం..

బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను ఎంఐఎం కౌన్సిలర్లు బహిష్కరించారు. మంగళవారం బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగాయి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.

మున్సిపల్‌లో నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ ఎంఐఎం సభ్యులు కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ మీర్ ఇలియాస్ అలీ ఆధ్వర్యంలో తొమ్మిది మంది కౌన్సిలర్లు ఎన్నికలను బహిష్కరించారు.