పంచాయతీ కార్యదర్శి డిప్యూటేషన్ రద్దు చేయాలి
ఎంపీడీవోకు డోంగర్గావ్ గ్రామస్తుల వినతి
ఆంధ్రప్రభ ఇందర్వెల్లి అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని డోంగర్గావ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆడా దిలీప్ డిప్యూటేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ డోంగర్ గావ్ గ్రామస్తులు సోమవారం ఎంపీడీవో మహేందర్ కు వినతిపత్రం అందజేశారు.పంచాయతీ కార్యదర్శి వేరే చోటకు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో గ్రామంలో పంచాయతీ పనులు స్తంభించాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామ కార్యదర్శి ఆడా దిలీప్‌ను డోంగర్ గావ్ గ్రామంలోనే కొనసాగించాలి.
డిప్యూటేషన్ రద్దు చేసి గ్రామంలోనే విధులు నిర్వహించేలా చూడాలన్ని గ్రామస్తులు ఎంపీడీవోను కోరారు. గ్రామాభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల అమలుకు కార్యదర్శి లేకపోవడం ఇబ్బందిగా మారిందని విన్నవించారు.
ఈ విషయంపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మడావి లచ్చు, చౌవన్ దత్త, యాకుబ్ బెగ్, మాడావి శేషనారాయణ, పెందుర్ భీర్సవ్,పెందుర్ గణేష్,పాల్గొన్నారు.
