దరఖాస్తుల ఆహ్వానం..
నడిగూడెం, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం టీచర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్. పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాలల్లో పనిచేసేందుకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని మొదటి ప్రాధాన్యత మహిళలకే ఉంటుంది అన్నారు.
జిల్లాలో టీజీటీ తెలుగు-1 , ఆర్ట్/క్రాఫ్ట్ -4, జేఎల్ మ్యాథ్స్ -2 , జే యల్ ఫిజిక్స్-1, జేఎల్ బాటనీ-1, జేఎల్ హిస్టరీ-1. డిగ్రీ లెక్చరర్స్ స్టాటిస్టిక్స్-1, పొలిటికల్ సైన్స్-1 పోస్టులు ఖాళీగా ఉన్నందున దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు తగిన క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీలను జత చేసి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల, ఇమాంపేటలో జులై 2వ తేదీలోపు ఇవ్వాలన్నారు. డెమో, ఇంటర్వ్యూ పద్ధతిలో కమిటీ ద్వారా అభ్యర్థులను సెలక్షన్ చేయనున్నట్లు తెలిపారు.
