Husband Kills Wife | కుటుంబ కలహాలే కారణమా?..
Husband Kills Wife | కుటుంబ కలహాలే కారణమా?..
Husband Kills Wife | జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. నాగరాజు (40) తన భార్య లక్ష్మి (32) గొంతుకు టవల్ చుట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం అతడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

