ఘనంగా కేసముద్రం హై స్కూల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కేసముద్రం, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, కేసముద్రంకు చెందిన 1982–83 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల 12వ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీసీబీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మచ్చ ఐలయ్య అధ్యక్షత వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా పాల్వాయి రమాదేవి, పోలేపల్లి సంజీవరెడ్డి, ఓలం శ్రీనివాసరావు, పొక్కుల తదితరులు మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌సీ పూర్తి చేసి 43 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ప్రతి ఏడాది కలుసుకోవడం తమ స్నేహబంధానికి నిదర్శనమని అన్నారు. స్నేహం జీవితాంతం నిలిచే అమూల్యమైన బంధమని, పరస్పర సహకారం, ఆత్మీయత ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. గతంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్, సీహెచ్ అమరేందర్, మంచెన మనోహర్, అశోక్ కుమార్, శ్యాంసుందర్, కరెంట్ శ్రీను, గంధం శ్రీను, శ్రీరాం సత్యనారాయణ, ఏకాంతం రామ్మోహన్, నిర్మల, చంద్రకళ, పుష్ప, ఉమారాణి, పద్మ, జయశ్రీ, కనకలక్ష్మి, గౌసియా, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, కంది వెంకన్నతో పాటు మొత్తం 80 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.