ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం కార్యదర్శి సమ్మెట సమ్మయ్య గౌడ్ డిమాండ్ చేశారు.ఆదివారం మండల కేంద్రం నుండి ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండీ ఖాజామియా,జిల్లా ముఖ్య సలహాదారుడు ఆకుతోట సాయికృష్ణ,కార్యదర్శి చిర్ర ఉపేందర్,ఉపాధ్యక్షుడు రమేష్, అంబరీష,రేఖ నరసయ్య,కోట వెంకటయ్య తదితరులు ఉన్నారు.