AP | తిరుమలలో దిల్షాన్
AP | తిరుమలలో దిల్షాన్
కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శనానికి..
AP |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం టీజీ20 లీగ్‌లో ‘ఖమ్మం ఏసెస్’ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న దిల్షాన్, హైదరాబాద్ షెడ్యూల్ మధ్యలో లభించిన విరామ సమయంలో తిరుమలకు చేరుకున్నారు.
ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ ధోతి (పంచె) ధరించిన దిల్షాన్, స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకుల నుంచి వేదాశీర్వచనం అందుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఆలయం వెలుపల దిల్షాన్‌ను గుర్తించిన అభిమానులు, భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దిల్షాన్ కూడా అభిమానులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారికి అభివాదం చేశారు.
