YS Jagan | కార్మికుల తరఫున పోరాడతాం
YS Jagan | కార్మికుల తరఫున పోరాడతాం
YS Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న సుమారు 85 వేల మంది కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ‘స్మార్ట్ కిచెన్స్’ పేరుతో తమ పార్టీ నేతల ప్రయోజనాల కోసం పనిచేస్తూ, మధ్యాహ్న భోజన కార్మికులను ఉపాధి కోల్పోయే పరిస్థితికి నెడుతున్నారని ఆరోపించారు.
గత రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, ఒకవైపు వారి వేతనాన్ని రూ.3 వేలకు పెంచామని చెబుతూనే మరోవైపు వారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. మధ్యాహ్న భోజన కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
