ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి – ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ

ఈపూరు, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలని ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలంలోని అంగలూరు గ్రామంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి స్వయంగా వెళ్లి బూత్ స్థాయి ఏజెంట్లు, అధికారులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణలపై ప్రజలకు ఆయన ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలని జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆయనతో పాటు మండల నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.