మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను శనివారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముందుగా చల్లగరిగె గ్రామానికి చెందిన గులాం జిలానీ మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లిన గండ్ర వెంకటరమణారెడ్డి, పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, అంతిమయాత్రలో పాల్గొన్నారు.

తర్వాత జూకల్ గ్రామానికి చెందిన సౌడ కిషన్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తిరుమలాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందిన రెండేళ్ల చిన్నారి కంచు అన్వి కుటుంబాన్ని పరామర్శించి, చిన్నారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, చిట్యాల పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, పిట్ట సురేష్, జంబుల తిరుపతి, జన్నె సురేష్, పాశం శ్రీమన్నారాయణ, కంచర్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.