ఎస్ఐఆర్లో కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొనాలి
- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్
వేల్పూర్, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరిని నమోదు చేయించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ పిలుపునిచ్చారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఓటరు నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
