Death case | పరారీలో ఉన్న పోలీసుల కోసం గాలింపు

Death case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కేసులో పరారీలో ఉన్న పోలీసు సిబ్బందిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ఎస్‌ఐటీ అధికారులు, నిందితుల ఆచూకీ కోసం హైదరాబాద్‌, బెంగళూరుకు ప్రత్యేక బృందాలను పంపించారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషిస్తూ పరారీలో ఉన్న వారి కదలికలపై నిఘా పెంచారు.

కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న ఎస్‌ఐటీ, ఇప్పటికే పలువురు పోలీసు సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. అవసరమైన ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.